మెదక్/నర్సాపూర్, ఆగస్టు 31 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ తల్లి పైన అనుచిత వ్యాఖ్యలు, అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడినందుకు నిరసనగా బీజేపీ నర్సాపూర్ అసెంబ్లీ శాఖ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ చిత్రపటాన్ని దహనం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి సంగసాని సురేష్, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాపగారి రమేష్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు బుచ్చేష్ యాదవ్, బీజేపీ మండల అధ్యక్షుడు నీలి నగేష్, రాష్ట్ర నాయకులు పెద్ద రమేష్ గౌడ్, జిల్లా కార్యదర్శి బాలరాజు, మాజీ కౌన్సిలర్లు గోడ రాజేందర్, ఎరుకల యాదగిరి, రమేష్ యాదవ్, అసెంబ్లీ కన్వీనర్ రమణారావు, బీజేవైఎం రాష్ట్ర నాయకుడు వాల్దాస్ అరవింద్ గౌడ్, జిల్లా ఎస్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి రాములు నాయక్, నర్సాపూర్ పట్టణ అధ్యక్షుడు చంద్రయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శులు సంగసాని రాజు, రామ్ రెడ్డి, నర్సాపూర్ మండల ఉపాధ్యక్షుడు సంజీవ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి యాదగిరి, మాజీ కౌన్సిలర్ ఎరుకల యాదగిరి, సీనియర్ నాయకులు నాగేష్, బూత్ అధ్యక్షులు మహేందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
నర్సాపూర్ లో రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ నాయకుల ఆందోళన
Published On: August 31, 2025 7:06 pm