నర్సాపూర్ లో సన్న బియ్యం పంపిణీని పరిశీలించిన బీజేపీ నాయకులు

మెదక్/నర్సాపూర్, ఏప్రిల్ 4 (ప్రశ్న ఆయుధం న్యూస్): నర్సాపూర్ పట్టణంలోని 15వ వార్డులో రేషన్ షాపులో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మెదక్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ.. పేద ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ రేషన్ షాపులలో ఇస్తున్న 6 కిలోల బియ్యంలో 5 కిలోలో బియ్యం ప్రధాని నరేంద్ర మోదీ పంపిస్తున్నారని అన్నారు. ఇక నుండి సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని, బియ్యం బ్లాక్ మార్కెటింగ్ వెళ్లకుండా చూడాలని రేషన్ డీలర్లను కోరారు. అదే విధంగా రేషన్ డీలర్ల షాపులలో ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోను ఏర్పాటు చేయాలని అన్నారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం మెదక్ జిల్లాలోని రేషన్ షాపులో మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాధవనేని రఘునందన్ రావు ఫోటో కూడా ప్రోటోకాల్ చాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓబిసి మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాపగారి రమేష్ గౌడ్, బీజేపీ సీనియర్ నాయకులు పెద్ద రమేష్ గౌడ్, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు గుండం శంకర్, సీనియర్ నాయకులు నారాయణ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు బాలరాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి రామ్ రెడ్డి, ఉపాధ్యక్షుడు సంగసాని రాజు, నాయకులు నగేష్ గౌడ్, మహేందర్, సంగమేశ్వర్, శ్రీకాంత్, కృష్ణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు 

Join WhatsApp

Join Now

Leave a Comment