మెదక్/నర్సాపూర్, ఆగస్టు 31 (ప్రశ్న ఆయుధం న్యూస్): మాన్ కి బాత్ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ అభివృద్ధి పథకాలను వివరించారు. ఆదివారం నర్సాపూర్ లో బీజేపీ నాయకులు మాన్ కి బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుల నీరుడు చంద్రయ్య, నీలి నగేష్, సీనియర్ నాయకులు జిల్లా జనరల్ సెక్రటరీ సంగసాని సురేష్, ఓబిసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్న రమేష్ గౌడ్, మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు బుచ్చేష్ యాదవ్, మాజీ జనరల్ సెక్రెటరీ గోడ రాజేందర్, అసెంబ్లీ కన్వీనర్ రమణారావు, నర్సాపూర్ పట్టణ ప్రధాన కార్యదర్శులు సంగసాని రాజు, రామ్ రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు సంజీవరెడ్డి, ప్రధాన కార్యదర్శి యాదగిరి, సీనియర్ నాయకులు నాగేష్, బూత్ అధ్యక్షులు మహేందర్, శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ ఎరుకల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
నర్సాపూర్ లో మాన్ కి బాత్ కార్యక్రమం వీక్షించిన బీజేపీ నాయకులు
Published On: August 31, 2025 9:59 pm