సంగారెడ్డి/మెదక్, ఆగస్టు 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును స్వాగతిస్తున్నామని, అణగారిన వర్గాల దశాబ్దాల పోరాటానికి న్యాయం జరిగిందని బీజేపీ మెదక్ నియోజకవర్గ ఇంచార్జ్, నిజాంపేట్ మాజీ జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ అన్నారు. గురువారం నాడు ఆయన మాట్లాడుతూ… ఎస్సీ వర్గీకరణ కోసం మంద కృష్ణ మాదిగ అలుపెరగని పోరాటం చేశారన్నారు. ఎస్సీ వర్గీకరణతో ఎంతో మందికి లభ్ది చేకూరుతుందని వివరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్రమోదీ ఇచ్చిన హామీ మేరకు మోదీ ఎంతో కృషి చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బీజేపీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అనంతరం మంద కృష్ణ మాదిగను పంజా విజయ్ కుమార్ కలిసి శుభాభివందనలు తెలిపారు.
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును స్వాగతిస్తున్నాం: బీజేపీ మెదక్ నియోజకవర్గ ఇంచార్జ్ పంజా విజయ్ కుమార్
Published On: August 1, 2024 7:43 pm