మెదక్/నర్సాపూర్, మార్చి 11 (ప్రశ్న ఆయుధం న్యూస్): నర్సాపూర్ అటవీ సంపదను, ప్రకృతి వనరులను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ అన్నారు. నర్సాపూర్ లోని జేఏసీ ఆధ్వర్యంలో డంపుయార్డుకు వ్యతిరేకంగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షకు ఆయన మంగళవారం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ.. నర్సాపూర్ అటవీ ప్రాంతం, ప్రకృతి సమతుల్యతను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. డంపుయార్డు ఏర్పాటుతో నర్సాపూర్ అటవీ సౌందర్యం నాశనమవుతుందని, ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని తెలిపారు. అటవీ సంపదను కాపాడేందుకు అందరూ ఒక్కటిగా పోరాడాలని, ఈ నిరాహార దీక్ష ఉద్యమానికి పూర్తి మద్దతు ఇస్తామని మల్లేష్ గౌడ్ తెలిపారు. డంపుయార్డు రద్దు చేసే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, డంపుయార్డు ఏర్పాటును అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు పాల్గొన్నారు.
నర్సాపూర్ అటవీ సంపదను కాపాడుకుందాం: బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్
Updated On: March 11, 2025 7:23 pm
