మండల సమస్యలపై బిజెపి నిరసన ర్యాలీ

మండల సమస్యలపై బిజెపి నిరసన ర్యాలీ

మండల తహసీల్దార్ కు మెమోరాండం అందజేసిన బిజెపి శ్రేణులతో కలిసి మండల అధ్యక్షుడు బైరెడ్డి

జమ్మికుంట ఇల్లందకుంట ఆగస్టు 25 ప్రశ్న ఆయుధం

మండల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న పాపాన లేదని వెంటనే అధికారులు ప్రజా ప్రతినిధులు కల్పించుకొని మండల సమస్యలను తీర్చాలని బిజెపి పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు ఇల్లందకుంట మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు బైరెడ్డి రమణారెడ్డి బిజెపి శ్రేణులతో కలిసి స్థానిక సమస్యల పై నిరసన ర్యాలీ మండల కేంద్రంలో బండమడుగు నుండి అపర భద్రాద్రి, ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో గల గరుడ చౌరస్తా వరకు నిర్వహించారు నిరసన ర్యాలీకి జిల్లా కార్యదర్శి సిహెచ్ నరసింహ రాజు హాజరై ఇల్లందకుంట బీజేపీ మండల అధ్యక్షుడు బైరెడ్డి రమణారెడ్డి తో కలిసి మాట్లాడుతూ ఇల్లందకుంట మండలం ఏర్పడి దాదాపు పది సంవత్సరాలు అయినా ప్రభుత్వం ఇప్పటి వరకు ఇంటర్ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు కాలేదని తహసీల్దార్, పోలీస్ స్టేషన్స్ కు పక్క భవనాలు ఏర్పాటు చెయ్యాలని, బస్టాండ్, మార్కెట్ యార్డ్ నిర్మించాలని, వివిధ గ్రామాలలో ఉన్న స్థానిక సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఇల్లందకుంట మండల బీజేపీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీ లు, 420 హామీలను వెంటనే అమలు చేయాలనీ, ప్రభుత్వం ఏర్పడి దాదాపు 21 నెలలు అవుతున్న, ఆసరా పెంచన్లు 4000, వికలాంగులకు 6000, రైతులకు రుణమాఫీ,సన్న వడ్లకు బోనస్,రైతు భరోసా, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని స్థానిక తహసీల్దార్ కి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు గుత్తికొండ రాంబాబు, ఆరెల్లి శ్రీనివాస్,కొత్త శ్రీనివాస్, కంకణాల రవీందర్ రెడ్డి,అబ్బిడి తిరుపతి రెడ్డి, ఎండీ షఫీ, నల్ల లింగారెడ్డి, మట్ట పవన్ రెడ్డి,తాళ్ల పాపిరెడ్డి, ఇంగ్లే రమేష్, చదువు సాయిరెడ్డి, ఉప్పు దుర్గయ్య, కొక్కుల దేవేందర్, పలకల కిషన్ రెడ్డి, వలసాని సునీల్, కూకట్ల రాజిరెడ్డి, గురుకుంట్ల సంజీవ్, తిప్పరబోయిన సమ్మయ్య, జంగం సమ్మయ్య, చిట్ల శ్రీనివాస్, విజయగిరి శ్రీనివాస్,గుడికందుల రమేష్,కోడం భరత్, మేకల మురళి, సానవేన శ్రీనివాస్, మాదాసు మొగిలి,రాధారపు ఐలయ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment