*విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ లో ఘనంగా బోనాల వేడుకలు*
*హుజురాబాద్ జులై 19 ప్రశ్న ఆయుధం*
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ స్కూల్లో ఘనంగా ముందస్తు బోనాల పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ బోనాల పండుగ విజ్ఞాన్ స్కూల్ లో ఏర్పాటు చేసిన వేడుకలో కరస్పాండెంట్ దాసరి కోటేశ్వర్ పాల్గొని మాట్లాడుతూ మనందరినీ ఒక్కటి చేసే పండుగ బోనాల పండుగ అని తెలంగాణ వ్యాప్తంగా మన సాంప్రదాయాలకు గుర్తుగా ప్రతి సంవత్సరం జరుపుకుంటామని తెలిపారు.అలాగే మన సంస్కృతిని, సంప్రదాయాన్ని గౌరవిస్తూ, రాబోయే తరానికి మూల స్తంభాలైన విద్యార్థినీ విద్యార్థులకు పండుగలను తెలియజేయుటకే బోనాల పండుగను వేడుకలా సంతోషంగా, ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. ఈ వేడుకలలో విద్యార్థినీ విద్యార్థులు అమ్మవారిగా, పోతురాజులు వివిధ రకాల వేషాధారణలతో ప్రత్యక్షమై చూపరులను ఆకట్టుకున్నారు
ఈ కార్యక్రమంలో విజ్ఞాన్ స్కూల్ కరస్పాండెంట్ దాసరి కోటేశ్వర్, డైరెక్టర్ తిరుపతి యాదవ్, ప్రిన్సిపల్ సౌమ్య కోఆర్డినేటర్ సుమలత తో పాటుగా ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.