అంగన్వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవం

అంగన్వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవం

ప్రశ్న ఆయుధం ఆగస్టు 02: కూకట్‌పల్లి ప్రతినిధి

జగద్గిరిగుట్ట శివానగర్2 అంగన్వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవం అంగన్వాడి టీచర్ గుండ్ర శ్రీలత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శివానగర్ అంగన్వాడి2 కేంద్రంలో తల్లిపాల ప్రాముఖ్యత మరియు బిడ్డకి తల్లి పాలు ఇవ్వడం వల్ల జరిగే ప్రయోజనాలు ఇప్పుడే పుట్టిన శిశువు నుండి ఆరు నెలల శిశువు వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. మరియు ఏడు నెలల నుండి తల్లిపాలతో పాటు అదనపు పోషకాహారాన్ని కూడా అందించాలని గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు మరియు చిన్నారి బాలబాలికల తల్లిదండ్రులకు వివరించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జగద్గిరిగుట్ట సెక్టార్ సూపర్వైజర్ శ్రీదేవి .శివానగర్ టు అంగన్వాడీ టీచర్ గుండ్ర శ్రీలత, హెల్పర్ రుక్మిణి, శ్రీనివాస్ నగర్ టు అంగన్వాడి టీచర్ రేణుక హెల్పర్ భాగ్యలక్ష్మి.ఆశా వర్కర్ సుక్కమ్మ. ప్లాన్ ఇండియా ఎన్జిఓ వాలంటరీ స్వరూప మరియు చిన్నారి బాలబాలికలు వారి తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.

Join WhatsApp

Join Now

Leave a Comment