పోసాన్‌పల్లిలో తల్లిపాల వారోత్సవాలు

*గర్భిణీలకు శ్రీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసన*

*జీపీ లెవెల్‌లో వెల్‌బేబీ షోప్కు మంచి స్పందన*

*ఐసిడీఎస్,అంగన్‌వాడీ టీమ్ నిర్వహణలో చక్కటి కార్యక్రమం*

కొమురవెల్లి, ఆగస్టు 5 (ప్రశ్న ఆయుధం): కొమురవెల్లి మండలంలోని పోసాన్‌పల్లి గ్రామ అంగన్‌వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గర్భిణీలకు శ్రీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామ పంచాయతీ స్థాయిలో వెల్‌బేబీ షోకూ మంచి స్పందన లభించింది. తల్లులు శ్రీలక్ష్మి, అశ్విని, శిరీష, లాస్యతో పాటు గ్రామస్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఐసిడీఎస్ సూపర్వైజర్ ఉమాదేవి, ప్రైమరీ పాఠశాల హెచ్‌ఎం రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి జావిద్, అంగన్‌వాడీ టీచర్లు మల్లీశ్వరి, లలిత, ప్రేమలత, మంజుల, రేణుక, భవాని, స్వప్న తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now