నల్ల బ్యాడ్జీలు ధరించి అసెంబ్లీకి హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 1(ప్రశ్న ఆయుధం న్యూస్): శాసన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ మహిళా శాసన సభ్యుల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసనగా.. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావు, చింత ప్రభాకర్, సబితా ఇంద్రారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి తదితరులు అసెంబ్లీకి హాజరయ్యారు.