బండి సంజయ్ ని రాజకీయంగా ఎదుర్కోలేని కేటీఆర్
క్షేత్రస్థాయిలో దిగ్విజయనేత బండి సంజయ్
కేటీఆర్ బెదిరింపులకు బండి సంజయ్ కుమార్ భయపడరు-దీటుగా జవాబు ఇస్తారు
బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్
*కరీంనగర్ సెప్టెంబర్ 16 ప్రశ్న ఆయుధం*
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ రాజకీయ వ్యాఖ్యలను బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎదుర్కునే దమ్ము ధైర్యం లేకుండా పోయిందని అందుకే బండి సంజయ్ కుమార్ పై పరువు నష్టం కేసు వేశారని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు మంగళవారం రోజున కరీంనగర్ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బండి సంజయ్ కుమార్ కిందిస్థాయి నుండి అనేక రాజకీయ ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడ్డ క్షేత్రస్థాయి దిగ్విజయ నేత అని తెలిపారు. కార్పొరేటర్ నుండి కేంద్రమంత్రి స్థాయికి వచ్చిన బండి సంజయ్ కుమార్ కు కేటీఆర్ కు రాజకీయంగా ఎంతో తేడా ఉందన్నారు. కెసిఆర్ కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చిన కేటీఆర్ నాడు అధికార అహంకారంతో ఎంతోమందిని దుర్భాషలాడారన్నారు బండి సంజయ్ కుమార్ ను కేటీఆర్ వ్యక్తిగతంగా విమర్శించి, దుర్భాషలాడిన సందర్భాలు అనేకం ఉన్నాయన్నారు బండి సంజయ్ కుమార్ వాస్తవ విషయాలు మాట్లాడితే కేటీఆర్ జీర్ణించుకోలేని స్థితిలో ఉన్నారని అందుకే పరువు నష్టం దావా కేసులు వేశారని తెలిపారు ముఖ్యంగా బండి సంజయ్ కుమార్ రాష్ట్ర అధ్యక్షుని హోదాలో ఉన్న సమయంలో నాటి బి ఆర్ ఎస్ పై చేసిన వ్యాఖ్యలకు గతంలో కేటీఆర్ పరువు నష్టం కేసు వేశారని నేడు కూడా అదే రీతిలో కేటీఆర్ మరొక పరువు నష్టం కేసు వేశారన్నారు. గతంలో వేసిన పరునష్టం కేసు కోర్టులో నిలబడలేదని, నేడు వేసిన కేసు కూడా అలాగే నీరుగారి పోతుందన్నారు. కేటీఆర్ రాజకీయ విమర్శలను, వ్యాఖ్యలను తట్టుకునే స్థితిలో లేరని , అందుకే పనికిమాలిన రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఘాటుగా విమర్శించారు. కేటీఆర్ బెదిరింపులకు బండి సంజయ్ కుమార్ భయపడరని, దీటుగా బదులిస్తారని తెలిపారు.