మల్కాజిగిరి కార్పొరేషన్ పరిధిలోని తూంకుంటలో నూతనంగా ‘తాజా మాంసం’ విక్రయ కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ ఈ కేంద్రాన్ని ప్రారంభించారు.
తూంకుంటలోని మందాయిపల్లి రోడ్లో నేమురి సాయికిరణ్ గౌడ్, నాగిరెడ్డి అవినాష్ రెడ్డి, జమల్పూర్ అజయ్, గనీ సంయుక్తంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ విక్రయ కేంద్రంలో వినియోగదారులకు నాణ్యమైన, పరిశుభ్రమైన చికెన్, మటన్, చేపలు మరియు రొయ్యలు అందుబాటులో ఉంచుతామని నిర్వాహకులు తెలిపారు.
కేవలం షాపులో అమ్మకాలే కాకుండా, తూంకుంట పరిసర ప్రాంతాల్లో 5 కిలోమీటర్ల పరిధిలో ఆన్లైన్ ద్వారా హోం డెలివరీ సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నట్లు వారు వెల్లడించారు. యువత స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయడాన్ని అతిథులు అభినందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్టీఏ సభ్యుడు భీమిడి జైపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్లు గోల్డ్ శ్రీనివాస్, ఎద్దు నాగేశ్ యాదవ్, మాజీ ఉప సర్పంచ్ తిరుపతి శంకర్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు సింగిరెడ్డి మధుసూదన్ రెడ్డి, పచ్చిమడ్ల నర్సింగ్ రావు గౌడ్, బొల్లబోయిన రాజు యాదవ్ పాల్గొన్నారు.
వీరితో పాటు పలువురు నాయకులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ విక్రయ కేంద్రం విజయవంతంగా కొనసాగాలని వారు ఆకాంక్షించారు.










