గురుకులాల్లో ఆనంద కేళి

గురుకులాల్లో
Headline :
సంగారెడ్డి గురుకులాల్లో ఆనంద కేళి – డైట్, కాస్మెటిక్ ఛార్జిల రెట్టింపు

సంగారెడ్డి ప్రతినిధి, నవంబరు 2 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంక్షేమ వసతి గృహాలు, సంక్షేమ గురుకులాల విద్యార్థులకు సంబంధించి డైట్, కాస్మెటిక్ ఛార్జిలను రెట్టింపు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో సంబంధిత అధికారులు, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. దీని ద్వారా సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా దాదాపు 25 వేల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. ఈ విషయమై మహాత్మ జ్యోతిబాపూలే బీసీ వెల్ఫేర్ బాలుర పాఠశాల ఝరాసంగం (దిగ్వాల్ )లో సంబరాలు నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు హరీశ్వర్ రెడ్డి, సహ ప్రధానోపాధ్యాయుడు రమేష్, ఉపాధ్యాయ బృందం సమక్షంలో విద్యార్థులంతా కలిసి కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ విజయం కొరకు కృషి చేసిన ఉన్నత అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

Join WhatsApp

Join Now