సంగారెడ్డి/పటాన్ చెరు, అక్టోబర్ 24 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఎమ్మెల్సీ డా.చిన్నమైల్ అంజిరెడ్డి, గోదావరి కుమారుడు అనీష్ రెడ్డి వివాహం హైదరాబాదులోని హైటెక్స్ లో ఘనంగా జరిగింది. ఈ మేరకు నూతన వధూవరులను సీఎం రేవంత్ రెడ్డి తో పాటు కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ గవర్నర్లు బండారు దత్తాత్రేయ, విద్యాసాగర్ రావు , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాష్ట్ర మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు.
నూతన వధూవరులను ఆశీర్వాదించిన ప్రముఖులు
Published On: October 24, 2025 6:48 pm