కర్మన్ ఘాట్ హనుమాన్ నగర్ లో మహిళ మెడలో చైన్ స్నాచింగ్.
ఇంటి ముందు పూలు కొస్తున్న మహిళ మెడలో చైన్ లాక్కుని పరార్.
హైదరాబాద్: ఇంటి ముందు పూలు కొస్తున్న మహిళ మెడలో చైన్ లాక్కుని పరారైనా ఘటన సరూర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ని కర్మన్ ఘాట్ శ్రీ హనుమాన్ నగర్ లో జరిగింది.
వివరాలు ప్రకారం..సరూర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ని కర్మన్ ఘాట్ శ్రీ హనుమాన్ నగర్ లో వృద్ద మహిళ ఇంటి ముందు పూలు కోస్తుండగా ద్విచక్ర వాహనంపై వొచ్చిన దుండగుడు వృద్ధురాలు మెడలో చైన్ లాక్కుని పరారయ్యాడు.
సమాచారం అందుకున్న సరూర్ నగర్ పోలీసులు ఘటన స్థలికి చేరుకుని సీసీ కెమెరాలను పరిశీలిస్తూ దుండగుడి కోసం గాలింపు చేపట్టారు.