మెగా మెగా ఇంటి కోడలు ఉపాసనకు కీలక పదవి… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

మెగా మెగా ఇంటి కోడలు ఉపాసనకు కీలక పదవి… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

సంతోషం వ్యక్తం చేసిన ఉపాసన…

మెగా ఇంటి కోడలు.. రాం చరణ్ సతీమణికి తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది.

ముఖ్యమంత్రి రేవంత్ తనకు అప్పగించిన బాధ్యతల పట్ల ఉపాసన సంతోషం వ్యక్తం చేశారు

సీఎం కు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో క్రీడా రంగాన్ని మరింత అభివృద్ధి చేసే లక్ష్యంతో కాంగ్రెస్ సర్కార్ ‘స్పోర్ట్స్ పాలసీ 2025’ను తీసుకొచ్చిన రేవంత్ ప్రభుత్వం తాజాగా ‘స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణ’ను ఏర్పాటు చేసింది. ఈ సంస్థకు చైర్మన్‌గా సంజీవ్ గోయెంకాను నియమించింది. మెగా కోడలు ఉపాసన కామినేనిని కో చైర్మన్‌గా నియమించింది.

తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఉపాసనకు బాధ్యతలు కేటాయిస్తూ అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ బాధ్యతల కేటాయింపు పైన ఉపాసన స్పందించారు. స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణకు తనను కో చైర్మన్‌గా నియమించటంపై ఉపాసన సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఈ నియామకం తనకు ఎంతో గౌరవాన్ని ఇచ్చిందని చెప్పుకొచ్చారు. తనకు సంజీవ్ గోయెంకాతో కలిసి పనిచేసే అవకాశం రావటం మరింత గౌరవంగా భావిస్తున్నట్లు ఉపాసన పేర్కొన్నారు.బోర్డు సభ్యులుగా సన్ టివీ నెట్‌వర్క్, సన్ రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్, ప్రముఖ క్రికెటర్ కపిల్ దేవ్, పుల్లెల గోపిచంద్, భూటియా, అభినవ్ బింద్రా, రవికాంత్ రెడ్డి తదితరులను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క్రీడల్లో తెలంగాణను దేశానికి రోల్ మాడల్‌గా నిలపాలన్న సంకల్పంతో క్రీడా విధానం తెచ్చామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

.

Join WhatsApp

Join Now

Leave a Comment