మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బర్త్ డే విషెస్..

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బర్త్ డే విషెస్..

తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్,సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రాష్ట్ర‌ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.తన పుట్టినరోజును పురస్కరించుకుని పొంగు లేటి శ్రీనివాస్ రెడ్డి, మర్యాదపూర్వకంగా సీఎంను సోమవారం ఉదయం కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి బర్త్ డే విషెస్ చెప్పారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్న మవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతు డు సంపూర్ణ ఆయురారో గ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రికి పొంగులేటి ధన్యవాదాలు తెలిపారు.మంత్రి పొంగులేటి పుట్టిన రోజు సందర్భంగా ప‌లువు రు మంత్రులు, ఎమ్మెల్యేలు, మిత్రులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే మిత్రులు, శ్రేయోభి లాషులు, అభిమానులు, నాయకులు, కార్యకర్తలం దరూ బొకేలు, శాలువాలు లేకుండానే రావాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు..

Join WhatsApp

Join Now