రెండవ శనివారం రోజున ఓ ప్రైవేట్ పాఠశాలలో చిన్నారికి అగ్నిప్రమాదం..

రెండవ శనివారం రోజున ఓ ప్రైవేట్ పాఠశాలలో చిన్నారికి అగ్నిప్రమాదం..

నిజామాబాద్,

నిజామాబాద్ నగరంలో వర్ని రోడ్ ఫారెస్ట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న ఓ స్కూల్లో రెండవ తరగతి చదువుతున్న చిన్నారి కోమలి తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చేరింది దీనిపై తల్లిదండ్రులను వివరణ కోరగా శనివారం రోజు భోగి వేడుకలు నిర్వహించారని మంటలో ఓ టీచర్ పెట్రోల్ పోయడంతో అదే బాటిల్ ను పాపపై విసరడంతో కాళ్లు చేతులు కాలిపోయాయని తండ్రి జనార్ధన్ తెలిపారు. ఈ విషయం ఇలా ఉండగా స్కూల్ యాజమాన్యం ని వివరణ కోరగా ఆయన ఆ సమయంలో స్కూల్లో లేడని తెలిపారు, రెండవ శనివారం ప్రతి పాఠశాలకు సెలవులు ఉండగా ఈ స్కూల్ కి మాత్రం సెలవులు ఎందుకు పాటించలేదు , అనే ప్రశ్న అందరి నోట వినిపిస్తుంది ఇది ఇలా ఉంటే స్కూల్ యజమాన్యం స్కూల్లో లేకపోవడం గమనార్హం స్కూల్ యాజమాన్యం మాట్లాడుతూ అది అనుకోకుండా ప్రమాదవశాత్తుగా జరిగింది కాబట్టి మా స్కూల్ స్టాఫ్ పాపను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారని తెలిపారు, ఆ తర్వాత తండ్రి కి సమాచారం ఇవ్వడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా పాప చికిత్స పొందుతుంది, పాపకు ఎంత ఖర్చైనా స్కూలే భరిస్తుందని స్కూల్ యాజమాన్యం తెలిపారు సంఘటన స్థలానికి ఎంఈఓ సాయి రెడ్డి వచ్చారు ఎలా జరిగింది అనే కోణంలో దర్యాప్తు చేస్తామని తెలిపారు విద్యార్థినికి ఎలాంటి అపాయం జరగకుండా చూసుకుంటామని స్కూల్ యాజమాన్యం తెలిపారు.

Join WhatsApp

Join Now