🔹 రౌడీషీటర్ రియాజ్ ఎన్‌కౌంటర్‌పై డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టీకరణ
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రియాజ్ ఏఆర్ కానిస్టేబుల్ వద్ద గన్ లాక్కునేందుకు ప్రయత్నించాడు.
గన్ సొంతం చేసుకుని పోలీసులపై కాల్పులు జరపబోతున్న స్థితిలో ఉన్నాడు.
అతడి చర్యలతో ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉండేది.
ప్రజల ప్రాణాలను కాపాడే ప్రయత్నంలో భాగంగా పోలీసు చర్య జరిగింది.
“ప్రజల రక్షణే మా ప్రాధాన్యం” అని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు.
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 20 హైదరాబాద్:
రౌడీషీటర్ రియాజ్ ఎన్‌కౌంటర్‌పై డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు. రియాజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో బయట విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ వద్ద నుంచి ఆయుధం లాక్కునేందుకు ప్రయత్నించాడని తెలిపారు. ఆ గన్‌తో పోలీసులపై కాల్పులు జరిపేందుకు యత్నించాడని చెప్పారు. అలా జరిగి ఉంటే అక్కడ ఉన్న సిబ్బందితో పాటు ప్రజల ప్రాణాలకూ ముప్పు వాటిల్లేదని వివరించారు.
“అతడి చర్యతో పరిస్థితి అదుపులో ఉంచడం అసాధ్యం అయ్యింది. ప్రజల ప్రాణాలు రక్షించడమే లక్ష్యంగా పోలీసులు స్పందించారు. అదే నేపథ్యంలో ఎన్‌కౌంటర్ జరిగింది,” అని డీజీపీ స్పష్టం చేశారు. పోలీసుల నిర్ణయం పూర్తిగా చట్టపరమైనదే, ప్రజల రక్షణకోసమేనని ఆయన పేర్కొన్నారు.