జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ముగింపు వేడుకలు

సంగారెడ్డి ప్రతినిధి, నవంబరు 20 (ప్రశ్న ఆయుధం న్యూస్): జిల్లా గ్రంథాలయంలో వారోత్సవాల ముగింపు వేడుకలు జిల్లా గ్రంథాలయ సంస్థ, సంగారెడ్డి అధ్వర్యంలో జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ముగింపు వేడుకలు గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు జి.అంజయ్య, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వసుంధర సమక్షంలో నిర్వహించారు. వారం రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమాల్లో విజేతలు అయిన విద్యార్థులకు ముఖ్య అతిథులచే బహుమతి ప్రధానం చేశారు. ముఖ్య అతిథులుగా లింగాగౌడ్, అంజయ్యలు హాజరయ్యారు. 60 మందికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సహాయ గ్రంథపాలకులు ఆర్.శ్రీనివాస్, ప్రశాంత్ కుమార్, శోభారాని, సిబ్బంది వరలక్ష్మి, సావిత్రి, మంజుల, కృష్ణమూర్తి, జిల్లాలోని అన్ని మండలాల లైబ్రేరియన్లు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment