*ఇందిరమ్మ ఇంటికి సిఎం రేవంత్ భూమి పూజ..*
*నారాయణ పేట జిల్లా:*
తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడతగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3500 చొప్పున ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమానికి సిఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అప్పకపల్లి గ్రామంలో దళిత మహిళ బంగలి దేవమ్మ ఇంటి స్థలంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సిఎం భూమి పూజ నిర్వహించి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, ధనసరి సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, గృహ నిర్మాణ స్పెషల్ సెక్రటరీ వి.పి.గౌతమ్,జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎంపి డి.కే.అరుణ, ఎమ్మెల్యేలు పర్ణికా రెడ్డి, వాకిటి శ్రీ హరి, వీర్లపల్లి శంకర్, ప్రభుత్వ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.