Site icon PRASHNA AYUDHAM

పోలీసులమని బెదిరించి వసూళ్లు… ముగ్గురు అరెస్ట్

IMG 20251127 202542

పోలీసులమని బెదిరించి వసూళ్లు… ముగ్గురు అరెస్ట్

ఎస్సైలు రంజిత్ కుమార్, భువనేశ్వర్, మరియు దత్తాద్రి పట్టుకున్నారు.

దేవునిపల్లి పోలీసుల సడెన్ దాడిలో భాస్కర్, లక్ష్మణ్ పట్టివేటు 

–నవీన్ గౌడ్ పరారీలో

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 27

పోలీసులమని చెప్పి దోపిడీకి పాల్పడిన ముగ్గురిని దేవునిపల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. రాజంపేట మండల కేంద్రానికి చెందిన జింక భాస్కర్, అతని స్నేహితులు నవీన్ గౌడ్, లక్ష్మణ్ చిన్న మల్లారెడ్డి శివారులోని ఎల్లమ్మ దేవాలయం వద్ద ఒక వ్యక్తిని బెదిరించి రూ.1,800 నగదు, మొబైల్ ఫోన్ బలవంతంగా లాక్కున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా ముగ్గురు పోలీసుల పేరును చూపించి బెదిరింపులకు పాల్పడ్డట్లు బయటపడింది. గురువారం సాయంత్రం సరంపల్లి ఎక్స్ రోడ్ వద్ద వాహనాల తనిఖీ సందర్భంగా అనుమానాస్పదంగా తిరిగిన తెల్లరంగు హ్యుందాయ్ క్రెటా కారును పోలీసులు ఆపగా డ్రైవర్ జింక భాస్కర్ పారిపోవడానికి ప్రయత్నించాడు. వెంటనే స్పందించిన పోలీసులు భాస్కర్, లక్ష్మణ్‌లను అదుపులోకి తీసుకున్నారు. నవీన్ గౌడ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు.

ఎస్సైలు రంజిత్ కుమార్, భువనేశ్వర్, మరియు దత్తాద్రి. కానిస్టేబుల్ రవికిరణ్, రామస్వామి సిబ్బంది పట్టుకున్నారు.

నిందితుల నుంచి మొబైల్ ఫోన్, కారు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… ప్రజల భద్రతకు జిల్లా పోలీసు శాఖ అప్రమత్తంగా ఉంటుందని, ఎలాంటి అక్రమాలు, బెదిరింపులు జరిగినా వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.

Exit mobile version