మొండి వీరన్న తాండా వరి కొనుగోలు కేంద్రంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
పారదర్శకంగా కొనుగోలు చేపట్టి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని సూచన
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 28:
రామారెడ్డి మండలం మొండి వీరన్న తాండాలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా పాలనాధికారి, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతుల నుండి కొనుగోలు జరుగుతున్న వరి నమూనాలను స్వయంగా పరిశీలించిన కలెక్టర్, మాయిశ్చర్ శాతం (తేమ స్థాయి) ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా అని తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ, వరి నాణ్యత, తూకం ప్రక్రియల్లో పూర్తి పారదర్శకత ఉండాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రంలో బరువులు, తూకం యంత్రాలు, మాయిశ్చర్ మీటర్ల పనితీరును కూడా పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో DRDO సురేందర్, సివిల్ సప్లై అధికారి వెంకటేశ్వర్లు, మార్కెటింగ్ అధికారి శ్రీకాంత్, ఎంఆర్‌ఓ ఉమలత, రైతులు తదితరులు పాల్గొన్నారు.