లింగంపల్లి గురుకుల పాఠశాల, కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ వల్లూరు క్రాంతి

IMG 20240801 WA0265

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లి గురుకుల పాఠశాల, కళాశాలను గురువారం జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురుకుల హాస్టల్స్ ల్లో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ క్రాంతి అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ.. పిల్లలు రోడ్లపైన వచ్చి ధర్నా చేయడంపై రెసిడెన్షియల్ హాస్టల్ అధికారులపై ఆగ్రహం వ్యకం చేశారు. ఏదైనా సమస్యలు ఉంటే ఉన్నత అధికారుల దుష్టికి తీసుకోరావాలని సూచించారు. చదువుతున్న విద్యార్థులకు సంబంధించి పలు ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. సాంకేతిక విద్యను అధ్యాపకులు బోధిస్తున్నారా.. అని అడిగి తెలుసుకున్నారు. డిజిటల్ పాఠాలు తమకు బోధిస్తున్నారని విద్యార్థులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. విద్యార్థులు పట్టుదలతో చదివి భవిష్యత్తులో ఉన్నత ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు మంచి ఆహారంతో పాటు నాణ్యమైన విద్యను అందించాలని ఆన్నారు. కళాశాలలో పరిసరాలు శుభ్రంగా లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. కళాశాల ఆవరణలో పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శిని సూచించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తతో ఉండాలని అన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజు, ప్రిన్సిపాల్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now