76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జెండా ఆవిష్కరించిన కలెక్టర్
76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తొలుత కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పతాకావిష్కరణ గావించినారు. అనంతరం జిల్లా ప్రజా పరిషత్తు కార్యాలయంలో పతాకావిష్కరణ గావించినారు. అనంతరం కలెక్టరేట్ లో జరిగిన వేడుకలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ , ఎస్పీ సింధు శర్మ లు పోలీసు గౌరవ వందనం స్వీకరించిన అనంతరం పతాకావిష్కరణ చేశారు. జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై కలెక్టర్ ప్రసంగించారు. రైతు రుణమాఫీ పై మాట్లాడుతూ రైతును రాజుగా చేయాలనే తలంపుతో తొలిసారిగా రెండు లక్షల రూపాయల వరకు ఒకే దఫాలో రైతులను రుణ విముక్తి చేయడం జరిగిందన్నారు జిల్లాలో పంటల రుణమాఫీ 1, లక్ష, 258 మంది రైతులకు 718 కోట్ల రూపాయలను రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. రైతు భరోసా కింద వ్యవసాయ అభివృద్ధి రైతు సంక్షేమం ప్రభుత్వ ప్రాధాన్యత అంశంలో భాగంగా రైతు భరోసా సహాయాన్ని ప్రతి సంవత్సరం ఎకరాకు 12 వేలకు పెంచడం జరిగిందన్నారు వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు ఈ సహాయాన్ని నేటి నుండి అందించడానికి నిర్ణయం చేసిందని చెప్పారు. ఎవరైనా కొత్తగా దరఖాస్తులు ఇవ్వదల్చుకుంటే వీటిని స్వీకరించి పరిశీలన చేయబడతాయి అన్నారు. గత నాలుగు రోజులుగా జరిగిన గ్రామ సభలకు హాజరు కాలేని వారు మండల కేంద్రంలోని ప్రజాపాలన సేవ కేంద్రాలలో దరఖాస్తులు ఇవ్వవచ్చని పరిశీలన తర్వాత అర్హులందరికీ రేషన్ కార్డులను మంజూరు చేద్దామన్నారు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న రెండు లక్షల, 54 వేల రేషన్కార్ల ద్వారా నెలకు 454 మెట్రిట్ టన్నుల బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. చేయూత పథకం ద్వారా కామారెడ్డి జిల్లాలో అన్ని రకాల పింఛన్లు కలిపి ఒక లక్ష, 64,000 మంది పింఛన్ లబ్ధిదారులకు ప్రతినెల 36 కోట్ల 67 లక్షల రూపాయలను పంపింది చేయడం జరుగుతుందన్నారు.
అనంతరం రాజంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బాన్సువాడ బి.సి.హాస్టల్ విద్యార్థినిలచే సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ఆ తదుపరి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన విద్యార్థులకు జ్ఞాపికలను కలెక్టర్ అందజేశారు. సి.ఏం.కప్ క్రీడోత్సవాల నిర్వహణ కోసం విరాళాలు అందించిన సఫల ఫార్మా ఇండస్ట్రీస్ ఏం.డి. పైడి ఎల్లారెడ్డి, గాయత్రి షుగర్స్ ఏం.డి. వేంకటేశ్వర రావు లను సత్కరించారు. అనంతరం సి.ఏం. కప్ క్రీడల్లో విజేతలకు బహుమతి ప్రదానం, ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను కలెక్టర్ అందజేశారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణా రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ ( ట్రేని ఎస్పి ) ఎస్.పి. చైతన్య రెడ్డి, జిల్లా అటవీ అధికారిణి నిఖిత, అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, అధికారులు, పలు శాఖల ఉద్యోగులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.