జెడ్‌పి హైస్కూల్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

జెడ్‌పి హైస్కూల్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

విద్యార్థులకు నోట్‌బుక్స్ అందజేసిన జిల్లా పాలనాధికారి 

ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 27

గురువారం

మాచారెడ్డి మండలం సోమవార్ పేట్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గురువారం ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. పాఠశాల ప్రాంగణంలో పరిశుభ్రత పరిస్థితులను పరిశీలించిన ఆయన, ఆవరణ మొత్తం శుభ్రంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పాఠశాల యాజమాన్యానికి సూచనలు జారీ చేశారు. తదుపరి పదవ తరగతి తరగతి గదిని సందర్శించిన కలెక్టర్, విద్యార్థుల హాజరు శాతం, పాఠశాలలో జరుగుతున్న బోధన విధానాలను పరిశీలించారు. విద్యార్థులతో ఆత్మీయంగా మాట్లాడిన ఆయన, పదవ తరగతి ఉత్తీర్ణత శాతం పెరగాలంటే ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుకోవాలని, టీచర్లు అందిస్తున్న మార్గదర్శకాలను పూర్తిగా వినియోగించుకోవాలని ప్రోత్సహించారు.  విద్యా ప్రమాణాలు మెరుగుపడాలని ఆశిస్తూ, విద్యార్థులకు స్వయంగా నోట్‌బుక్స్ అందజేశారు. పట్టుదలతో చదివి మంచి ర్యాంకులు సాధించాలని విద్యార్థులను ప్రోత్సహించారు. అనంతరం విద్యార్థుల అభిరుచుల గురించి తెలుసుకున్న కలెక్టర్, “మీకు ఏ సబ్జెక్ట్ ఇష్టం? ఎందుకు ఇష్టం?” అని అడిగి, వారు చెప్పిన విషయాలను ఆసక్తిగా విని ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థుల అధ్యయన ఆసక్తిని అభినందిస్తూ ప్రతీ విద్యార్థికి నోట్‌బుక్స్ అందజేశారు.   పాఠశాలలో అందిస్తున్న భోజనం మెనూ ప్రకారం ఉన్నదేమో తెలుసుకున్నారు. జిల్లాలో విద్యా ప్రమాణాలు మెరుగుపరచేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను పకడ్బందీగా అమలు చేయాలని, ఫలితాలు మెరుగుపడే విధంగా కృషి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ సూచించారు.     తనిఖీలో విద్యాశాఖ అధికారి రాజు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తహసిల్దార్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment