కాలనీ వాసులు బస్తీ సమస్యలపై
కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కి వినతి పత్రం అందజేత
ప్రశ్న ఆయుధం, అక్టోబరు 22: కూకట్పల్లి ప్రతినిధి
124 అల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని అంబెడ్కర్ నగర్ లో డ్రైనేజ్ మ్యాన్ హోల్స్ మరియు మంజీరా వాటర్ కు సంబంధించి సమస్యలు ఉన్నాయని కాలనీ వాసులు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ని కలిసి వినతి పత్రాన్ని అందించడం జరిగింది. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కాలనీ వాసులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పగిలిన మ్యాన్ హోల్స్ స్థానంలో కొత్త వాటిని ఏర్పాటుచేస్తామని అన్నారు. అలాగే కాలనీలోని కొన్ని గల్లీలలో మంజీరా వాటర్ ప్రెజర్ రావడం లేదని కాలనీ వాసులు తెలుపగా, జల మండలి అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని తెలియచేసారు. కార్యక్రమంలో బోయకిషన్, బప్పిరప్ప, మంగళి వెంకటేష్, రంగ స్వామి, రాజు, దేవయ్య తదితరులు పాల్గొన్నారు.