కామారెడ్డి జిల్లా కేంద్రంలో అమర వీరుడు భగత్ సింగ్ 95వ వర్ధంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో, పార్టీ జిల్లా కార్యదర్శి జబ్బర్ మాట్లాడుతూ, భగత్ సింగ్ త్యాగం స్వాతంత్ర్య పోరాటంలో కీలకమని, ఆయన, సుఖదేవ్, రాజ్గురుల త్యాగాలు చరిత్రలో చిరస్మరణీయమని పేర్కొన్నారు.
95 సంవత్సరాలు గడిచినా భగత్ సింగ్ ఆలోచనలు ప్రజల్లో నిలిచి ఉన్నాయని, నేటి యువత వారి స్ఫూర్తితో దేశం కోసం, ప్రజల హక్కుల కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.
దేశ సంపద ప్రజలకే చెందేలా కృషి చేయడమే భగత్ సింగ్ వంటి మహనీయులకు నిజమైన నివాళి అని జబ్బర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రాజు, శ్రీనివాస్, కొమురయ్య, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.











