మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మధుకర్, పిల్లలు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. మంచిర్యాల కలెక్టరేట్లో జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పిల్లల భవిష్యత్తుకు విద్య ఎంత ముఖ్యమో, వారికి లభించే అవకాశాలను అందిపుచ్చుకోవడం కూడా అంతే ముఖ్యమని మేయర్ ఈ సందర్భంగా తెలిపారు.
చైల్డ్ కేర్ ఇనిస్టిట్యూట్లలోని పిల్లలకు అవసరమైన ధ్రువపత్రాలు, ఆధార్ కార్డు, కుల దృవీకరణ, బ్యాంక్ ఖాతా, జనన ధ్రువీకరణ, ఇతర పత్రాలను అందించినట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ పత్రాలు పిల్లలు భవిష్యత్తులో విద్య, ఉపాధి అవకాశాలను పొందడానికి ఎంతగానో ఉపయోగపడతాయని మేయర్ వివరించారు.











