తూర్పుగోదావరి జిల్లా తాడిమల్ల గ్రామంలో దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మదర్ తెరిసా వికలాంగుల సంక్షేమ సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
రాష్ట్ర అగ్రికల్చర్ మిషన్ డైరెక్టర్ కోరశిఖ చంద్రమౌళి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, దివ్యాంగ శక్తి పథకం కింద అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంపై సంఘం సభ్యులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఈ పథకం ద్వారా దివ్యాంగుల రోజువారీ జీవితంలో ప్రయాణ ఖర్చుల భారం తగ్గి, ఉద్యోగాలు, వైద్యం, ఇతర అవసరాల కోసం సులభంగా ప్రయాణించే అవకాశం కలుగుతుందని సంఘం సభ్యులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీల నాయకులు, అభిమానులు హాజరై, దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రశంసించారు.











