డాక్టర్స్ డే సందర్భంగా బాల్కొండలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రొడ్యూన్స్ హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ శ్రావ్యను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
బాల్కొండలోని ప్రొడ్యూస్ హాస్పిటల్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో, డాక్టర్ శ్రావ్య అందిస్తున్న వైద్య సేవలను అభినందిస్తూ ఆమెకు లయన్స్ క్లబ్ సభ్యులు శాలువా కప్పి సన్మానించారు.
లయన్స్ క్లబ్ అధ్యక్షుడు బారిగడి మల్లేష్ మాట్లాడుతూ, వైద్య వృత్తి యొక్క ప్రాముఖ్యతను, సమాజానికి వైద్యులు అందిస్తున్న సేవలను గురించి వివరించారు. డాక్టర్లను గౌరవించుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు.
ప్రొడ్యూన్స్ హాస్పిటల్ మేనేజ్మెంట్ తరపున జక్కపద్మారావ్ మాట్లాడుతూ, డాక్టర్ శ్రావ్య తన వృత్తి పట్ల అంకితభావంతో పనిచేస్తున్నారని, ఆమె సేవలు ప్రశంసనీయమని తెలిపారు. ఈ సన్మానం డాక్టర్ శ్రావ్యకు మరింత స్ఫూర్తినిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సెక్రటరీ తౌడు గంగాధర్, లింగా గౌడ్, కటికి శీను, కళ్యాణ్ రాజేందర్, భూసరత్నాకర్, అంది గిరి, దేవతి పోశెట్టితో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు. డాక్టర్ శ్రావ్యకు శుభాకాంక్షలు తెలియజేశారు.











