తెలంగాణ రాష్ట్రంలో వివిధ రెడ్డి సంఘాలు ఏకమై, ఒకే రాష్ట్ర రెడ్డి సంఘంగా ఏర్పడ్డాయి. హైదరాబాద్‌లోని నాగోల్ ప్రాంతంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రెడ్ల భవిష్యత్తు భద్రత, ఆర్థిక, రాజకీయ అసమానతలు, ఎదురవుతున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని, అన్ని సంఘాలు ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి. నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి రాష్ట్ర కో-కన్వీనర్‌గా నియమితులయ్యారు.
హైదరాబాద్‌లోని నాగోల్ ప్రాంతంలో పిఎంఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశంలో, తెలంగాణ రాష్ట్రంలోని వివిధ రెడ్డి సంఘాలు ఏకమై, ఒకే రాష్ట్ర రెడ్డి సంఘంగా ఏర్పడాలని నిర్ణయించాయి. రెడ్ల భవిష్యత్తు భద్రత, ఆర్థిక, రాజకీయ అసమానతలు, ఎదురవుతున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని, అన్ని సంఘాలు ఏకవాక్య తీర్మానంతో ఈ నిర్ణయం తీసుకున్నాయని సమావేశంలో తెలిపారు.
ఈ నూతన కమిటీ ఏర్పాటు చారిత్రాత్మకమని, రాష్ట్రంలో ఒకటే రెడ్డి సంఘం ఉండాలనే నినాదంతో అందరూ కలిసికట్టుగా ముందుకు వచ్చారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నల్లవెల్లి కరుణాకర్ రెడ్డిని రాష్ట్ర కో-కన్వీనర్‌గా నియమించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద రెడ్లకు, విద్యార్థులకు ఈ కమిటీ అండగా ఉంటుందని, భవిష్యత్తు కోసం భరోసా కల్పిస్తుందని నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రెడ్డి కార్పొరేషన్‌ను వెంటనే ఏర్పాటు చేసి, పాలకవర్గంతో పాటు బడ్జెట్‌ను కేటాయించాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఇతర సామాజిక వర్గాల ప్రజలకు ప్రభుత్వం నిర్మించిన కుల భవనాల తరహాలో, రెడ్ల కోసం పది ఎకరాల స్థలాన్ని కేటాయించి, భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
తన నియామకానికి సహకరించిన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు ఏనుగు సంతోష్ రెడ్డి, రాష్ట్ర హడాక్ కమిటీ చైర్మన్ బద్దూరి వెంకటేశ్వర్ రెడ్డి, రాష్ట్ర రెడ్డి నాయకులకు నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర అడ్ హాక్ కమిటీ చైర్మన్‌గా బద్దూరి వెంకటేశ్వర రెడ్డి, కన్వీనర్‌గా బుట్టెంగారి మాధవరెడ్డి, కో-కన్వీనర్లుగా నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి, కొట్టం మధుసూదన్ రెడ్డి, వసంత రెడ్డి, నూకల పద్మ రెడ్డి, గంగుల శ్రీలత రెడ్డి, నందికొండ గీత రెడ్డి, సభ్యులుగా ఎన్నేపల్లి లింగారెడ్డి, ఎలిమినేటి సుమన్ రెడ్డి, సలహాదారులుగా ఏనుగు సంతోష్ రెడ్డి, పిట్టా శ్రీనివాస్ రెడ్డి, గోపు జైపాల్ రెడ్డి, నల్ల సంజీవరెడ్డి, నావల్గా సత్య నారాయణ రెడ్డి, బొక్క భూపాల్ రెడ్డి, బొబ్బిలి దామోదర్ రెడ్డి నియమితులయ్యారు.












