నిజామాబాద్, 2026-07-19
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, వైశ్య సమాజం ఐక్యతతో ముందుకు సాగుతూ సామాజిక, రాజకీయ రంగాల్లో మరింతగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఆర్యవైశ్య పట్టణ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని ఉత్తర తిరుమలలో నిర్వహించిన వనభోజన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
వైశ్య సమాజం ఐక్యతతో ముందుకు సాగుతూ సామాజిక, రాజకీయ రంగాల్లో మరింతగా ఎదగాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పిలుపునిచ్చారు. ఆర్యవైశ్య పట్టణ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని ఉత్తర తిరుమలలో నిర్వహించిన వనభోజన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆషాఢ మాసంలో ప్రతి ఏడాది వనభోజనాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. వైశ్య కుటుంబాలన్నీ ఒకేచోట చేరి ఆటపాటలతో ఆనందంగా గడపడం సంతోషకరమని పేర్కొన్నారు.
వైశ్యులు పరస్పర ఐక్యతను పెంపొందించుకుని కష్టసుఖాల్లో ఒకరికొకరు అండగా నిలవాలని సూచించారు. వైశ్యులు కేవలం వ్యాపార రంగానికే పరిమితం కాకుండా ఆధ్యాత్మిక సేవలు, ఆలయాల అభివృద్ధి, సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటారని కొనియాడారు. సేవాభావంలో వైశ్య సమాజానికి ప్రత్యేక గుర్తింపు ఉందని ఎమ్మెల్యే అన్నారు.
అంతకుముందు ఎమ్మెల్యే వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య పట్టణ సంఘం అధ్యక్షుడు ధన్పాల్ శ్రీనివాస్ గుప్తా, కార్యదర్శి ఇల్లెందుల ప్రభాకర్, కోశాధికారి గాలి నాగరాజు, కార్యవర్గ సభ్యులు, ఆలయ ధర్మకర్త సంపత్ తదితరులు పాల్గొన్నారు.












