ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న లయన్స్ ఇంటర్నేషనల్ ఆశయాలకు అనుగుణంగా, లయన్స్ డిస్ట్రిక్ట్ 320-డి పరిధిలోని శేరిలింగంపల్లి రీజియన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను లయన్స్ అంతర్జాతీయ డైరెక్టర్ లయన్ గట్టమనేని బాబురావు అభినందించారు. విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ రంగాల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి జిల్లా స్థాయిలో మంచి గుర్తింపు సాధించాలని ఆయన పిలుపునిచ్చారు.
"సేవయే పరమార్థం", "We Serve – Together We Can" అనే నినాదంతో ప్రపంచవ్యాప్తంగా 220కి పైగా దేశాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న లయన్స్ ఇంటర్నేషనల్ ఆశయాలకు అనుగుణంగా, లయన్స్ డిస్ట్రిక్ట్ 320-డి పరిధిలోని శేరిలింగంపల్లి రీజియన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను లయన్స్ అంతర్జాతీయ డైరెక్టర్ లయన్ గట్టమనేని బాబురావు అభినందించారు.
విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ రంగాల్లో ఈ ఏడాది మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి జిల్లా స్థాయిలో మంచి గుర్తింపు సాధించాలని ఆయన పిలుపునిచ్చారు.
స్థానిక శ్రీ కన్వెన్షన్, రామచంద్రాపురంలో జరిగిన లయన్స్ డిస్ట్రిక్ట్ 320-డి 5వ రీజియన్ (శేరిలింగంపల్లి) ఇన్స్టాలేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, వైద్య సేవల ద్వారా సమాజానికి విశేష సేవలందిస్తున్న పూర్వ గవర్నర్లు జే.ఆర్. సూర్యారావు, సి.హెచ్. ప్రకాశ్‌రావు, ప్రాణహిత లయన్స్ క్లబ్ సభ్యులు, ఉషాశ్రీ తదితరులను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో పూర్వ గవర్నర్లు సి.హెచ్. ప్రకాశ్‌రావు, జే.ఆర్. సూర్యారావు, రాజ్‌కుమార్, గంప రమేశ్, గాంధాని శ్రీనివాస్, ఏ.అమర్నాథ్రావు, ప్రథమ ఉప గవర్నర్ నర్సింహారాజు, ద్వితీయ ఉప గవర్నర్ పద్మావతి, రీజియన్ చైర్మన్ జి. వెంకన్న, ఆర్ఎస్ఎం వెంకటేశం, జోన్ చైర్మన్లు మల్లేశం, గాయత్రి, సుధీర్, జిల్లా గ్యాట్ సభ్యులు, ఆర్సీలు, పీఎస్టీలు, ప్రముఖులు రాఘవేంద్రరావు, ఎస్.రామ్‌మనోహర్‌రావు, పి.అశోక్‌గౌడ్, రాములుగౌడ్, జనార్దన్‌రెడ్డి, లక్ష్మీనారాయణగౌడ్, మర్రి ప్రవీణ్, శ్రీధర్, పీఆర్వో అనంతరెడ్డి, జీఎంటీ, జీఎస్టీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.












