వెలుగుమట్ల భూదాన్ భూముల్లో నివాసం కోల్పోయిన బాధితులకు పువ్వాడ ఫౌండేషన్ మరియు భారత్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో భోజన వసతి ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాల మేరకు ఈ సహాయక చర్య చేపట్టారు.
భారత రాష్ట్ర సమితి వర్కింగ్ కమిటీ అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు ఇచ్చిన హామీ మేరకు, వెలుగుమట్ల భూదాన్ బాధితులకు అండగా నిలవాలని పువ్వాడ ఫౌండేషన్ ఈ ఏర్పాటు చేసింది.
మంగళవారం జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాత మధుసూదన్ స్వయంగా బాధితులకు భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్లను కూల్చివేసి రోడ్డున పడేసిందని విమర్శించారు.
బాధితులకు గూడు దొరికే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

