*స్వాతంత్ర్య వేడుకలలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకుడు పులిమామిడి రాజు*

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 15 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని 12వ వార్డులో ఉషాకిరణ్ యూత్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన జెండా కార్యక్రమంలో పులి మామిడి రాజు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అందరికి ముందుగా 78 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మనకు స్వాతత్య్రం తెచ్చినటువంటి మహనీయులను స్మరించుకొని వారి జ్ఞాపకాలను గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వారందరి త్యాగ ఫలితంగానే మనకు స్వాతంత్రం సిద్ధిచ్చిందని అన్నారు. మన మందరం దేశం కోసం పాటుపడాలని యువతకు సూచించారు. మన దేశం పటిష్టంగా ఉండాలంటే ముఖ్యంగా యువత చెడుమార్గంలో పోకుండా ఉండే బాధ్యత మనందరి మీద ఉందని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి నడవడిని మరియు దేశ భక్తిని చిన్నప్పటినుండే అలవాటు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో చీలం సురేష్, శ్రీనివాస్, హరీష్, అనిల్, వెంకట్, మాలె శ్రీనివాస్,సురేష్, అనిల్, వెంకట్, నరేష్, శివ, వినయ్, రవి, వేణు, సుధాకర్, కిషన్, సతీష్, పీఎంఆర్ యువసేన నాయకులు రాగం అనిల్, తాలెల్మ రాము, మనోజ్, అఖిల్, ఫయాజ్, ఫహీం, జబ్బార్, సోమ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now