*నర్సాపూర్ లో కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన కాంగ్రెస్ నాయకులు*

మెదక్/నర్సాపూర్, ఆగస్టు 16 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఉచిత బస్సుల సౌకర్యంపై తెలంగాణ మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడిన నేపథ్యంలో నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిష్టిబొమ్మను నాయకులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పీసీసీ ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ లు మాట్లాడుతూ.. ఉచిత బస్సులపై కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను, ఆరు గ్యారెంటీల పథకాలను చూసి ఓర్వలేక బీఆర్ఎస్ పార్టీ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుహాసిని రెడ్డి, శ్రీనివాస్ గుప్తా, మల్లేశం, ఆంజనేయులు గౌడ్, అశోక్, రషీద్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now