సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 15 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని పాతకేరి (పనకట్ట) సమీపంలో శ్రీ మార్కండేయ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడు వినాయక మండప కర్రపూజ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకుడు పులిమామిడి రాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు. శ్రీ వేద పండితుని మంత్రాల ఉచ్చారణతో గణపతి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. రానున్న రోజులలో వినాయక చవితి సందర్భంగా యువత, పెద్దలందరూ భక్తిశ్రద్ధలతో, భజనలతో, మేళ తాళాలతో గణేష్ చతుర్థిని ప్రశాంతంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని ప్రజలకు సూచించారు. వినాయక చవితి పండుగను అన్ని మతాలవారు కలిసి భిన్నత్వంలో ఏకత్వంగా జరుపుకునే పండగని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీమార్కండేయ యువజన సంఘం సభ్యులు గుజ్జరి బాగప్ప, వెంకన్న బాబు, పోల గణేష్ , చిలువెరి రవికుమార్, రుమాండ్ల రాజు, చిలువరి వెంకటేశం, రాఘవేందర్, మహేష్, నరేష్, యెన్నం నర్సింలు, సాయి కిరణ్, పీఎంఆర్ యువసేన నాయకులు మనోజ్, రాగం అనిల్, అఖిల్, టి.రామన్న, సోమ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
*వినాయకుని పూజలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు పులిమామిడి రాజు*
Published On: August 15, 2024 3:31 pm