బోనాల ఉత్సవాలలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

IMG 20240728 WA0169 scaled

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 28 (ప్రశ్న ఆయుధం న్యూస్): గ్రామీణ వాతావరణంలో నిర్వహించే బోనాల ఉత్సవాలు ప్రజలను సుఖసంతోషాలతో ఉంచుతాయని కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్‌ అన్నారు. మెదక్ పార్లమెంట్ సంగారెడ్డి పట్టణంలో ముదిరాజ్ సంఘం, కుమ్మరి సంఘం, పలు కాలనీలలో అంగరంగ వైభవంగా నిర్వహించిన బోనాల ఉత్సవాలలో నీలం మధు ముదిరాజ్ టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్, కాంగ్రెస్ నాయకులు పులిమామిడి రాజులతో కలిసి ‌పాల్గొని ప్రత్యేక పూజలు చేసి కొబ్బరి కాయ కొట్టి ఫలాహారం బండి ఊరేగింపు ప్రారంభించారు. బోనాల నిర్వాహకులు నీలం మధు ముదిరాజ్‌ను ఘనంగా సత్కరించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆయన కోరారు. రాష్ట్రంలో ఊరూరా ఉత్సవాలు ఘనంగా జరగడంలో ముఖ్యంగా ప్రభుత్వం పండగులకు ప్రాధన్యత ఇవ్వడం వల్లే సాధ్యమైందన్నారు. ఈకార్యక్రమంలో వరలక్మి, పిట్టల రమేష్, కుమ్మరి బాలకృష్ణ, కుమ్మరి సతీష్, రామకృష్ణ, బొట్టు వెంకట్, జనార్ధన్, రమణ, ఎస్వీ శ్రీనివాస్, శ్రీనివాస్, పవన్, కృష్ణ, ఆనంద్, కుమ్మరి అశోక్, కుమ్మరి సాయిలు, కుమ్మరి రాములు, ముదిరాజ్, కుమ్మరి సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now