ప్రేమించి మోసం చేసిన కానిస్టేబుల్..యువతి ఆత్మహత్య

*పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.*

  • *ఫోన్ నెంబర్ బ్లాక్ లో పెట్టడంతో మనస్థాపం.*

*గడ్డి మందు తాగి యువతి ఆత్మహత్య..

శివ్వంపేట, సెప్టెంబరు 4 (ప్రశ్న ఆయుధం న్యూస్): ప్రేమించిన వ్యక్తి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఫోన్ నెంబర్ బ్లాక్ లో పెట్టడంతో ఓ యువతి గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండల పరిధిలోని తాళ్లపల్లి తాండలో చోటు చేసుకుంది. తాండవాసులు తెలిపిన వివరాల ప్రకారం… బానోత్ కేశ్య మూడవ కూతురు సక్కుబాయి (21) ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. నారాయణఖేడ్ చెందిన సుధాకర్ అలియాస్ సిద్దు, సంగారెడ్డిలో కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. సుధాకర్, సక్కుబాయి గత రెండేళ్ల క్రితం నుంచి ప్రేమించుకుంటున్నారు. సక్కుబాయి పెళ్లి చేసుకుందామని అడగడంతో సుధాకర్ రెండు నెలల నుంచి ఫోను మాట్లాడడం మానేసి నెంబర్ బ్లాక్ లో పెట్టాడు. దీంతో మనస్థాపానికి గురైన ఆమె సోమవారం తాళ్లపల్లి తండాలో తన ఇంటి వద్ద గడ్డి మందు తాగింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బహదూర్ పల్లిలో ఓ ప్రైవేటు హాస్పిటల్ లో చేర్చారు. అక్కడి నుంచి గాంధీ హాస్పిటల్ తరలించగా.. చికిత్స పొందు గురువారం తెల్లవారుజామున మృతి చెందింది. ఈ ఘటనపై మృతురాలి తండ్రి కేశ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment