సంగారెడ్డి/పటాన్ చెరు, ఆగస్టు 11 (ప్రశ్న ఆయుధం న్యూస్): తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహాను రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్ప నగేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రామచంద్రపురం డివిజన్ లో ఉన్న సమస్యలు గురించి చర్చించి, సుమారు 5.50 కోట్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యల కొరకు ప్రతిపాదనను వినత పత్రం అందజేశారు. అనంతరం జల మండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డికి ఫోన్ చేయించి, త్వరగా నిధులు మంజూరు చేయాలని మంత్రి ఆదేశించారు. డివిజన్ లో ఒక్కసారి పర్యటించి, పలు సమస్యలు ఉన్నాయని అధికారులతో పర్యటిస్తే డివిజన్ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని కార్పొరేటర్ పుష్ప నగేష్ కోరారు. త్వరలోనే పర్యటిస్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు.
*మంత్రిని కలిసిన కార్పొరేటర్ పుష్ప నగేష్*
Published On: August 11, 2024 10:03 pm