మెదక్/నర్సాపూర్, ఆగస్టు 15 (ప్రశ్న ఆయుధం న్యూస్): నర్సాపూర్ మున్సిపల్ 2వ వార్డు సునీతాలక్ష్మారెడ్డి కాలనీలో అంగన్ వాడీ కేంద్రం ఆవరణలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకం ఆవిష్కరణ కార్యక్రమంలో కౌన్సిలర్ లతా రమేష్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ లతా రమేష్ యాదవ్ చిన్నారులకు పలకలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడీ టీచర్ హైమావతి, ఆయమ్మ సుజాత, ఆర్పీ మాధవి, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
*చిన్నారులకు పలకలు, పండ్లు పంపిణీ చేసిన కౌన్సిలర్ లతా రమేష్ యాదవ్*
Published On: August 15, 2024 1:27 pm