కుల గణనపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలి.
సిపిఐ నాయకులు డిమాండ్.
కోటగిరి పిబ్రవరి 16.
కోటగిరి మండల కేంద్రంలోని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో యశశ్రీ పాఠశాలలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్, బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జ్ దుబాస్.రాములు మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదవర్గాలకు కాకుండా కార్పోరేట్ వ్యక్తులకు,సంపన్న వర్గాల కోసం కేటాయించిన పద్ధతిలో కేంద్ర బడ్జెట్ ఉన్నదని వెంటనే సవరించి అమలు చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో బీసీ బిల్లును రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపడాన్ని మేము సాగతిస్తున్నామన్నారు. బీసీ బిల్లును బీసీలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటులో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు ఆమోదింపజేసి బీసీ బిల్లును ముందుకు తీసుకురావాలన్నారు. లేనియెడల బీసీల పట్ల చరిత్రహీనులుగా మిలిగిపోతారన్నారు. ఈ సమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి విటల్ గౌడ్ సిపిఐ మండల నాయకులు నల్ల గంగాధర్, శంకర్, నాగరాజు, బాల్రాజ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.