గూడూరు మండలంలోని విద్యాశాఖాధికారి మరియు స్కూల్ అసిస్టెంట్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
గూడూరు మండలానికి చెందిన విద్యాశాఖాధికారితో పాటు స్కూల్ అసిస్టెంట్ ఒకరు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యండెడ్‌గా చిక్కారు. రిటైర్ట్ ఉద్యోగికి రావాలసిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ బెనిఫిట్స్ బిల్లుల కోసం రూ. 15వేలు లంచం తీసుకుంటుండగా వరంగల్ యూనిట్ ఏసీబీ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు.
గూడూర్ జిల్లా పరిషత్ స్కూల్లో హెడ్మాస్టర్గా, ఎంఈవోగా పనిచేస్తున్న అయోధ్యరాం, స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న చంద్రమౌళి లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి వరంగల్ కోర్టు హాజరుపరిచామని ఏసీబీ అధికారులు తెలిపారు.










