కామారెడ్డి జిల్లా దేవన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గాయత్రి నగర్ కాలనీలో కుటుంబ సమస్యలతో సతమతమవుతున్న ఓ యువకుడు గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
గాయత్రి నగర్ కాలనీకి చెందిన వంగ సాయిబాబా (33) అనే వ్యక్తి, కుటుంబ కలహాల కారణంగా ఇంట్లోనే సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మృతుడు పద్మశాలి కులానికి చెందినవాడని, బీడీ కంపెనీలో టేకేదార్‌గా పనిచేస్తున్నాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
ఈ దారుణ ఘటనపై మృతుడి భార్య వంగ మానస దేవన్‌పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు, ఎస్సై రంజిత్ కుమార్ నేతృత్వంలో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు దారితీసిన పూర్తి కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.


