ఖమ్మం జిల్లా మధిరలో ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. మధిర సమీపంలోని ఒక ప్రైవేటు వెంచర్లో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
మధిర సమీపంలోని ఒక ప్రైవేటు వెంచర్లో గుర్తుతెలియని వ్యక్తులు ఒక వివాహితను దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని అక్కడే పడేసి వెళ్లిపోయినట్లు సమాచారం.
స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు.
మృతురాలిని ఎన్టీఆర్ జిల్లా మేడూరు గ్రామానికి చెందిన కల్పన (28)గా గుర్తించారు. ఆమె మధిరలోని ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నట్లు తెలిసింది.
ఈ హత్యకు గల కారణాలు, నిందితులెవరనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.











