నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్ ఫోర్స్, రూరల్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్) బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచిన కేసు నమోదైంది. ఈ ఘటనలో 10.5 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
లక్ష్మీపూర్ గ్రామంలో సబేరా బేగం ఇంట్లో ఈ అక్రమ నిల్వను పోలీసులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని పోలీస్ స్టేషన్కు తరలించి, డిటి పంచనామా నిర్వహించారు.
సంఘటనపై సబేరా బేగంపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు రూరల్ ఎస్సై సతీష్ రెడ్డి తెలిపారు.
ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అందిస్తున్న పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేయడం, రవాణా చేయడం, విక్రయించడం వంటి చర్యలు చట్టరీత్యా నేరమని ఎస్సై హెచ్చరించారు. ఇలాంటి కార్యకలాపాలపై కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.
అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవడంలో ప్రజల సహకారం కీలకమని, అక్రమాల గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఎస్సై సతీష్ రెడ్డి కోరారు.











