కామారెడ్డి జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా 'అరైవ్ అలైవ్' అవగాహన కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ శ్రీ.బి.శివధర్ రెడ్డి గారు పాల్గొని, రోడ్డు భద్రతా నియమాల ప్రాముఖ్యతను వివరించారు.
క్షేమంగా, సురక్షితంగా గమ్యం చేరడం అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమం, హెల్మెట్ ధరించడం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకపోవడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించింది. కామారెడ్డి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ.ఎం.రాజేష్ చంద్ర ఐపీయస్ గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది.
పోలీసు కళాబృందం సభ్యులు పాటలు, మాటల ద్వారా రోడ్డు భద్రతపై సందేశాలు అందించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ శ్రీ.బి.శివధర్ రెడ్డి గారితో పాటు ఐజీ శ్రీ.చంద్రశేఖర్ రెడ్డి గారు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, డ్రైవర్లు, మహిళలు, పురుషులు, యువకులు హాజరయ్యారు.
రోడ్డు ప్రమాదాలను తగ్గించి, ప్రాణాలను కాపాడాలని ఈ కార్యక్రమం ద్వారా పిలుపునిచ్చారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ద్వారా సురక్షితమైన ప్రయాణాన్ని నిర్ధారించుకోవాలని సూచించారు.












