సంగారెడ్డి, జూలై 21
సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్న 16 మంది వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.1,55,080 నగదు, 15 మొబైల్ ఫోన్లు, 52 ప్లెయింగ్ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఆరుట్ల గ్రామ శివారులోని రామకృష్ణ రెడ్డి ఫామ్‌హౌస్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్న 16 మంది వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.1,55,080 నగదు, 15 మొబైల్ ఫోన్లు, 52 ప్లెయింగ్ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు.
సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరుట్ల గ్రామ శివారులో, సర్వే నెం.44లో ఉన్న రామకృష్ణ రెడ్డి ఫామ్‌హౌస్‌లో కొందరు వ్యక్తులు డబ్బులు పెట్టి ప్రభుత్వం నిషేధించిన మూడుముక్కలాట (పేకాట) ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ నేపథ్యంలో, సంగారెడ్డి రూరల్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి సమక్షంలో పోలీసు సిబ్బందితో కలిసి దాడి నిర్వహించారు.
ఈ దాడిలో పేకాట ఆడుతున్న 16 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి రూ.1,55,080 నగదు, 15 మొబైల్ ఫోన్లు, 52 ప్లెయింగ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
ఈ విషయమై సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి, నిందితులకు భారతీయ నాగరిక భద్రతా సంహిత (BNSS) సెక్షన్ 35(3) ప్రకారం నోటీసులు జారీ చేసినట్లు సంగారెడ్డి రూరల్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ పేకాట, జూదం, మట్కా వంటి అక్రమ కార్యకలాపాలు చట్టరీత్యా నేరం అని, ప్రజలు ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. జిల్లాలో ఎక్కడైనా పేకాట, జూదం లేదా ఇతర అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్ నెంబర్ : 8712656739 లేదా డైల్ 100 కు సమాచారం అందించవలసిందిగా కోరారు.












