సంగారెడ్డి, జూలై 20
భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా బొర్రా ప్రవీణ్ యాదవ్‌ను పార్టీ అధిష్ఠానం రెండోసారి నియమించింది. ఈ నియామకం తన వ్యక్తిగత గౌరవంతో పాటు, జిల్లా యువతపై పార్టీ ఉంచిన విశ్వాసానికి నిదర్శనమని ప్రవీణ్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా బొర్రా ప్రవీణ్ యాదవ్‌ను పార్టీ అధిష్ఠానం రెండోసారి నియమించింది. ఈ సందర్భంగా తనపై మరోసారి విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకత్వానికి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నియామకం తన వ్యక్తిగత గౌరవం మాత్రమే కాకుండా, సంగారెడ్డి జిల్లా యువతపై పార్టీ ఉంచిన విశ్వాసానికి నిదర్శనమని ప్రవీణ్ యాదవ్ పేర్కొన్నారు.
ఈ అవకాశం కల్పించిన సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు గోదారి అంజిరెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుందుతో పాటు తన నియామకానికి సహకరించిన పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
పార్టీ సిద్ధాంతాలను గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు అంకితభావంతో పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. ప్రతి మండలం, ప్రతి గ్రామంలో బీజేవైఎం సంస్థాగత బలోపేతానికి కార్యాచరణ రూపొందించి యువశక్తిని పార్టీ అభివృద్ధికి వినియోగిస్తామని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, ఎన్నికల హామీల అమలులో వైఫల్యాలు, యువత, రైతులు, నిరుద్యోగులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలపై అవగాహన కార్యక్రమాలు, ఉద్యమాలు నిర్వహిస్తామని తెలిపారు.
పార్టీ అప్పగించిన ప్రతి బాధ్యతను పదవిగా కాకుండా ప్రజాసేవకు లభించిన అవకాశంగా భావిస్తూ, కార్యకర్తలందరినీ కలుపుకొని బీజేపీ, బీజేవైఎం సంస్థలను సంగారెడ్డి జిల్లాలో మరింత బలోపేతం చేసేందుకు నిరంతరం కృషి చేస్తానని ప్రవీణ్ యాదవ్ తెలిపారు.












